కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు… పిచ్చోడి చేతిలో రాయి అంటూ !

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. మిగులు రాష్ట్రాన్ని కెసిఆర్ చేతిలో పెడితే …. పిచ్చోడి చేతిలో రాయిలా చేశాడంటూ నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో మున్సిపల్ పన్ను కానీ, కరెంట్ బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు.

కెసిఆర్ చేతకాని పరిపాలన కారణంగా…. విద్యుత్తు సంస్థలను, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.. అవి పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్ ఛార్జీలు, కరెంట్ బిల్లుల భారం పెంచేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల. రేట్లను పెంచి .. సామాన్యుడి పై పన్నుల భారం మోపుతున్నారని ఆగ్రహించారు. ప్రజల నడ్డి విరి చేందుకు తయార య్యారని సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే.. ఇంకా మీరెందుకు సారు..? రాజీనామా చెయ్యండని డిమాండ్‌ చేశారు వైఎస్ షర్మిల.