కేసీఆర్ కొడుకు అంటే అంత నముషా ? : కేటీఆర్ కు షర్మిల చురకలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మరోసారి షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీక్ష విరమించిన అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. “కేసీఆర్ కొడుకిని కేసీఆర్ కొడుకు అంటే నచ్చలేదు అంట. అమెరికా నుండి కొడుకుని తీసుకవచ్చి రెండు మంత్రి పదవులు అప్పజెప్పారు. కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు నముషీ” చురకలు అంటించారు షర్మిల.

చిన్న దొర జిల్లా కి వస్తున్నడంటే ప్రతి ప్రక్షలను ప్రశ్నించే జర్నలిస్టుల పై కేసులు పెడుతున్నారని.. నెరేళ్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని మండిపడ్డారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలో ఉద్యోగాలు ఇస్తే అన్ని ఉద్యోగులు భర్తీ అవుతాయి… ఇంటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాన తల్లి కన్నీళ్లు పెడుతుంది..  కేసిఆర్ పెద్ద దొర అంటూ ఫైర్ అయ్యారు. 1 లక్ష 91 ఉద్యోగాలు భర్తీ చేయలేని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని.. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందన్నారు..