చాతకాని ముఖ్య మంత్రి, చాతకాని మంత్రులు అంటూ టీఆర్ ఎస్ పార్టీ నాయకులు, సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. మద్దతు ధర ఉన్న వరి పండించడం రైతుల హక్కు అని… వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత అని చురకలు అంటించారు వైఎస్ షర్మిల. కొన్న వడ్లని బాయిల్డ్ చేసుకుంటరా, బంగారం చేసుకుంటరా, విదేశాలకు ఎగుమతి చేస్తారా, ఫార్మ్ హౌస్ ల పోస్తరా.. ఢిల్లీల పారబోస్తరా అది మీ పనితనమంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు వైఎస్ షర్మిల.
వడ్ల కొనుగోలుపై మీకున్న చిత్తశుద్ధి ఏదని ప్రశ్నించారు. ఆడ చాతకాక మద్దెల ఓడు అని వడ్లు కొనడం చాతకాక ఉద్దెర ముచ్చట్లు చెప్పుడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటాలు పెట్టాల్సిందే.వడ్లు కొనాల్సిందే. రైతును ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాదంటావా, వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దు.రైతుల చావుకోరుకుంటున్న ముఖ్యమంత్రి మాకొద్దంటూ చురకలు అంటించారు వైఎస్ షర్మిల.