రేపు మహబూబాబాద్ జిల్లా వైఎస్ షర్మిల పర్యటన

రేపు మహబూబాబాద్ జిల్లా వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సోమ్ల తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనుంది వైఎస్ షర్మిల. మహబూబాబాద్ జిల్లా లోని గుండెంగి గ్రామం లో రేపు షర్మిల ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఇక రేపు రాత్రి వరంగల్ పట్టణం లోనే బస చేయనున్నారు వైఎస్ షర్మిల.

ఉద్యోగ దీక్ష తో పాటు పోడు భూముల కై పోరు కు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు. ఇక అటు ఎల్లుండి ములుగు జిల్లా లింగాల గ్రామం లో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా లో వైఎస్ షర్మిల పర్యటన చేయనున్నారు. ఇక ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా గత మంగళ వారం రోజున.. హుజూరాబాద్ నియోజక వర్గం లో వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.