వైస్ షర్మిల దూకుడు.. ములుగు జిల్లాలో పోడుయాత్ర

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల.. దూకుడు పెంచారు. ప్రస్తుతం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోడు భూముల పరిష్కారం కోసం, పోడు రైతులకు భరోసా ఇవ్వడానికి.. వైఎస్ షర్మిల ఈరోజు ములుగు జిల్లాలో “పోడుభూములకై పోరు” కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉద‌యం 11గంట‌ల‌కు ములుగులోని అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి అనంత‌రం ప‌స్రా గ్రామంలోని కుమ్రం భీం విగ్ర‌హానికి నివాళి అర్పించారు, లింగాల గ్రామం వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టారు మార్గ మధ్యంలో వరి నాట్లు వేసే రైతు కూలీలతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు లింగాల‌లో “పోడుభూములకై పోరు” కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారు షర్మిల  కాగా .. నిన్న తెలంగాణా లోని నిరుద్యోగుల కోసం గూడూరు మండలం గుండెంగ గ్రామంలో వైయస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.