దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్.. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు గాను ఐఓఎస్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో ఈ గేమ్‌ను ఇప్పుడు ఐఫోన్, ఐప్యాడ్‌లలోనూ ప్లేయర్లు ఆడుకోవచ్చు. జూన్ నెలలో ఈ గేమ్ తొలి దశలో బీటా వెర్షన్‌లో మాత్రమే లభించింది. తరువాత కేవలం వారం రోజుల్లోనే గేమ్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా లభిస్తోంది.
ఐఓఎస్ 11.0 లేదా ఐప్యాడ్ ఓఎస్ 11.0 ఆపైన వెర్షన్ ఉన్న ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో ఈ గేమ్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీని సైజ్ 1.90 జీబీగా ఉంది. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్బంగా గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకున్న వారికి పలు ఔట్‌ఫిట్‌లు, కూపన్లు, రివార్డులు, పర్మినెంట్ స్కిన్‌లను అందిస్తున్నారు.
పబ్‌జి మొబైల్‌ను గతేడాది భారత్‌లో నిషేధించాక ఈ ఏడాది జూన్‌లో ఈ గేమ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక ఇండియన్ సర్వర్‌తో ఈ గేమ్‌ను లాంచ్ చేశారు. పేరును బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా మార్చారు. దీంతో ఈ గేమ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ గేమ్ లభిస్తుండడంతో మరింత మంది పబ్‌జి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.