YSRTP పార్టీ విస్తారణపై వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం

-

వైఎస్‌ ఆర్‌టీపీ పార్టీ అధినేత, వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని ప్రక్షాళన చేసే నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటన చేశారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత ఏడాది పార్టీని ప్రకటించిన అనంతరం పార్లమెంట్‌ నియోజక వర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు.

రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోసల్‌ మీడియా ఇన్‌ చార్జీలను నియమించారు. అయితే.. ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కోఆర్డినేటర్ గా వడుక రాజగోపాల్‌, రంగారెడ్డి జిల్లాకు ఎడమ మోహన్‌ రెడ్డి, ఖమ్మం కు కవిత, వికారాబాద్‌ కు తమ్మాలి బాలరాజ్, నల్గొండ జిల్లా కు ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరికి మహమ్మద్‌ అత్తార్‌ ఖాన్‌, ములుగు జిల్లా కు రామసహాయం శ్రీనివాస్‌ రెడ్డి, మిగతా జిల్లాలకు తదితరులను నియమించారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news