వైఎస్ సంస్మరణ సభ..విజయమ్మ ఆహ్వానం అందిన కీలక నేతలు వీళ్ళే..!

-

వైఎస్సార్ వ‌ర్థంతి సంధ‌ర్భంగా విజ‌య‌మ్మ‌ సంస్మ‌ర‌ణ‌స‌భ‌ను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు విజ‌య‌మ్మ మొత్తం 300మందిని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. సంస్మ‌ర‌ణ స‌భ వేదిక మీద 30 మందికి మాట్లాడే అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలుస్తోంది. సంస్మ‌ర‌ణ స‌భ‌కు రాజ‌కీయ‌నేత‌ల‌తో పాటు అన్ని రంగాల ప్ర‌ముఖుల‌కు విజ‌య‌మ్మ ఆహ్వానం ప‌లికింది. ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్ కు విజ‌య‌మ్మ‌ ప్ర‌త్యేక ఆహ్వానం ప‌లికారు. సినిమా రంగం నుండి ప్ర‌ముఖ న‌టులు చిరంజీవి, నాగార్జున‌, సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌,దిల్ రాజు ల‌కు ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తుంది.

vijayamma
vijayamma

వైద్యులు,అడ్వ‌కేట్లు,మాజి ఐఏఎస్ లు,ఐపిఎస్ లు,రిటైర్డ్ జ‌డ్డీల‌తో పాటూ వివిధ రంగాల ప్రముఖుల‌ను విజ‌య‌మ్మ ఆహ్వానించారు. స‌భ‌కు డాక్ట‌ర్ గురువారెడ్డి, శాంతాభ‌యోటెక్ ఎండీ వ‌ర‌ప్ర‌సాద్, గ్లోబ‌ల్ ఎండి ర‌వీంద్ర‌నాథ్ హాజ‌ర‌వుతున్నారు. సంస్మ‌ర‌ణ స‌భ‌కు రిటైర్డ్ జ‌డ్జ్ సుద‌ర్ష‌న్ రెడ్డి హాజ‌ర‌వుతున్నారు. 2004,2008 వైఎస్ క్యాబినేట్ లో ప‌నిచేసిన ఉభ‌య రాష్ట్రాల మంత్రుల‌కు విజ‌య‌మ్మ ఫోన్ చేసి ఆహ్వానించారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి స‌బిత‌, మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ సునితా ల‌క్ష్మారెడ్డి ,ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ల‌ను విజ‌య‌మ్మ ఆహ్వానించారు.

కాంగ్రెస్ నుండి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, జానారెడ్డి, దామోద‌ర రాజ‌న‌రసింహ‌, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీద‌ర్ బాబుకు ఆహ్వానం ప‌లికారు. రాజ్య‌స‌భ ఎంపి మాజి పీసిసి చీప్ డీ.శ్రీనివాస్ కు విజ‌య‌మ్మ ఫోన్ చేశారు. బీజేపినుంచి మాజి ఎంపి జితెంద‌ర్ రెడ్డి ,డీకే ఆరుణ‌ల‌కు కూడా విజ‌య‌మ్మ ఆహ్వానం ప‌లికారు. ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దిన్ ఓవైసీకి విజ‌య‌మ్మ‌ ఆహ్వానించారు. అయితే వైఎస్సార్ అంటే త‌న‌కు అభిమానం అని..కానీ స‌భ‌కు రాలేన‌ని అస‌ద్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ కు కూడా విజ‌య‌మ్మ ఆహ్వానం ప‌లికిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news