సీఎం జగన్‌ తో షర్మిల భేటీ !

రేపు దివంగత రాజశేఖర్‌ రెడ్డి 12 వ వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యం లోనే లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి వైఎస్‌ఆర్‌టీపీ వైఎస్ షర్మిల బయలు దేరారు. తల్లి విజయమ్మతో కలిసి… వైఎస్‌ షర్మిల ఇడుపుల పాయకు వెళ్లారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్ కి వైఎస్‌ విజయమ్మ తో కలిసి నివాళులు అర్పించనున్నారు వైఎస్‌ షర్మిల.

అయితే… రేపు అయినా.. ఏపీ ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తో వైఎస్‌ షర్మిల మాట్లాడుతారా ? లేదా ? అనే చర్చ అందరిలోనూ మొదలైంది. అయితే.. దీని పై క్లారిటీ రానుంది. ఇక మళ్లీ రేపు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకోనున్నారు షర్మిల. హైదరాబాద్‌ వచ్చిన అనంతరం పార్టీ కార్యాలయం లో భారీ ఎత్తున జాబ్ మేళా, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు షర్మిల. ఇక రేపు సాయంత్రం వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న సంస్మరణ సభ కు హాజరు కానున్నారు వైఎస్‌ షర్మిల.