సీఎం స్టాలిన్ తో మెగాస్టార్ చిరంజీవి కీలక సమావేశం…

మెగాస్టార్‌ చిరంజీవి.. సినిమాలతో పాటు… అటు రాజకీయాల నేతలతోనూ చాలా టచ్‌ లో ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అయినా.. ఇద్దరితోనూ మెగాస్టార్‌ చిరంజీవి చాలా సన్నిహితంగా ఉంటారు. చిత్ర పరిశ్రమకు ఎలాంటి సమస్యలను వారిని కలిసి.. పరిష్కరించు కుంటారు.

అయితే.. తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ ను కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పూట.. ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ ను కలిశారు మెగాస్టార్‌. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ కు పుష్ప గుచ్ఛం ఇచ్చి… వారికి శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్‌. కేవలం మర్యాద పూర్వకంగానే సీఎం స్టాలిన్‌ ను తాను కలిసినట్లు… చిరంజీవి మీడియా కు వెల్లడించారు. కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్‌ పై ప్రశంసలు కురిపిస్తూ… జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.