వైఎస్ వివేకా హ‌త్య కేసు.. రూ.8 కోట్ల సుపారీ..!

వైయస్ వివేకానంద మృతి కేసులో పురోగతి లభించింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సిబిఐ.. జమ్మల మడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాచ్ మెన్‌ రంగయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలంలో వాచ్ మెన్‌ రంగయ్య సంచలన విషయాలు వెల్లడించాడు.

వైఎస్‌ వివేకానందా రెడ్డి హత్య కు 8 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పిన వాచ్ మెన్‌ రంగయ్య.. మొత్తం తొమ్మిది మంది హత్య లో పాలుపంచుకున్నట్లు తెలిపాడు. వివేకా హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త మనుషులు ఇంట్లోకి వచ్చారని చెప్పాడు రంగయ్య. ఇక రంగయ్య స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళుతున్న సిబిఐ అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా రంగయ్య వాంగ్ములన్నీరికార్డ్ చేశారు.. ఈ కేసులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల హస్తం ఉన్నట్టు గా తెలిపారు రంగయ్య. దీంతో ఆ ప్రముఖ వ్యక్తులు ఎవరు అనే దాని పైన పూర్తిగా విచారణ చేస్తున్నారు సి.బి.ఐ అధికారులు.