ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఉత్తరాంధ్ర చాలా కీలకమైనది. విశాఖపట్టణంలో, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల పై ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపి ఈ ప్రాంతంలో దారుణంగా దెబ్బతిన్నది. పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టిన బాబు ప్రజా చైతన్య యాత్ర పేరిట అక్కడ పర్యటించేందుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ ప్రకటించిన తర్వాత కూడా వైజాగ్ వాసులు పెద్దగా ఉత్సాహం ఏమీ కనిపించలేదు. ఇదే అదనుగా చంద్రబాబు కూడా ఇప్పుడే ఉత్తరాంధ్రలో ఈ యాత్రతో మంచి పట్టు సాధించాలని బయలుదేరగా…. జగన్ దానికి ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విశాఖ పర్యటన లో చంద్రబాబుతో 50 మంది నాయకులకు మించి ఉండకూడదని…. కాన్వాయ్ లో వాహనాలు చాలా పరిమితంగా మాత్రమే ఉండాలని తదితర నిబంధనలు విధించారు.
దీనికితోడు చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించేలా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంతో విశాఖపట్టణంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ఏర్పడే అవకాశం ఉంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించాలని అతడి తీరుకు నిరసనగా ఆందోళనలు చేయాలని వైఎస్సార్సీపీ పరోక్షంగా సైగలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించేలా చేస్తున్నారు.
దీనితో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోకస్ చేస్తూ ప్రజలకు విరుద్ధంగా ఉన్న ప్రతి అంశాన్ని ప్రజల ముందు చూపిస్తూ ఎక్కడికక్కడ వైసిపి వారు ఎక్కడ ప్రజల్లో తమపై వ్యతిరేక భావన వస్తుందేమో అని భయపడేలా చేశారు. బాబు ఇంత డైరెక్ట్ గా టాప్ చేయడాన్ని ఊహించని జగన్ చివరికి ఆంక్షలు విధించడం తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవాళ వైజాగ్ ఎయిర్పోర్టు లో జరిగిన హై డ్రామా అందరం చూసాము. ఈ ఎపిసోడ్ చంద్రబాబు నే హీరో చేసేదిగా ఉంది అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. అనవసర సింపతీ జగన్ తెలిసో తెలీకో చంద్రబాబు ఖాతాలో వేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. వయసులో పెద్దవాడు కావడం తో చంద్రబాబు మీద ఏదైనా విమర్శ – దాడి జరిగితే ‘ పెద్దాయన్ని పట్టుకుని ఎందుకు అంత కక్ష సాధింపు ‘ అని సహజంగానే అనిపిస్తుంది అదే జరుగుతోంది ఇప్పుడు కూడా .. ఆ సింపతీ ఫార్మ్ చేసుకోవడం లో చంద్రబాబు నేర్పరి. కాబట్టి జగన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.