ఏపీలో కరోనా విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని కట్టుబాటు చర్యలు చేపట్టినా, మరోసారి లాక్ డౌన్ ప్రకటించినా ఈ వ్యాదికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే గన్ మెన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.. దాంతో అప్రమత్తమైన అధికారులు గన్ మెన్ ను క్వారంటైన సెంటర్ కు తరలించారు.. గన్ మెన్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యే షాక్ తిన్నాడు. ఎమ్మెల్యే కు కూడా టెస్టులు జరిపారు, కాగా రిపోర్ట్ గురించి ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక కరోన పాజిటివ్ అని తేలడంతో గన్ మెన్ ను ఏలూరు లోని కరోనా క్వారంటైన హాస్పిటల్ కు తరలించారు. ఆ గన్ మెన్ సొంత ఊరు అయిన చింతలపూడిని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఇక గన్ మెన్ కు పాజిటివ్ రావడంతో షాక్ తిన్నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్. అనంతరం ఎమ్మెల్యే కు కూడా అధికారులు టెస్టులు నిర్వహించారు కాగా రిపోర్టుకై ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబాన్ని క్వారంటైన్ లో ఉండమని సిబ్బంధి సూచనలు ఇచ్చారు.