ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు నర్సాపురం ఎంపీ వైసీపీ నేత రఘురామ కృష్ణంరాజు. రఘురామకృష్ణంరాజు వైసీపీ పార్టీ పై పార్టీ లోని నేతలపై చేసిన వ్యాఖ్యలు తెలిసినవే, ఇక ఈ క్రమంలో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దానికి రెస్పాండ్ అయిన ఎంపీ అవి షోకాజ్ నోటీసులు కావు ఫెక్ నోటీసులని ఆ నోటీసులలో పార్టీ పేరు తప్పు ఉందని వాటి పై అధినేత సంతకం లేదని నానా హంగామా చేశారు. ఆ షోకాజ్ నోటీసులపై నేడు మధ్యాహ్నం 12 గంటలకు తన సమాధానం చెబుతానని డేట్ తో సహా టైమ్ కూడా చెప్పారు ఓ టీవి కార్యక్రమం లో. ఆయన చెప్పిన డేట్ తో పాటు టైమ్ కూడా వచ్చేసింది ఇప్పుడు రాజకీయ నేతలంతా ఆయన ఏం సమాధానం చెబుతాడో అని వేచి చూస్తున్నారు.
ఇప్పటికే విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణ రాజు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరుకు, తనకు నోటీసు ఇచ్చిన వారి హోదాకు పొంతన లేదని తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించిన ఆయన తాను జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని తెలిపారు. పార్టీ లో డిసిప్లేన్ కమిటీ లేదని అసలు పార్టీకే డిసిప్లేన్ లేదని ఆలంటి నాకు షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు ఈమేరకు ఇప్పటికే ఆయన ఢిల్లీ లోని ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. దాంతో ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉందని బిజెపి లోకి వెలతారని అందుకు గాను బులిటెన్ ను నేడు 12 గంటలకు విడుదల చేస్తాడని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.