వైసీపీ ఎంపీ ద్విపాత్రాభిన‌యం.. ఎంపీగా గెలిచి.. ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్నాడా..!

-

తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గ‌ప్ర‌సాద్ వ్య‌వ‌హారం రోజురోజుకు వివాదంగా మారుతోందా ? వైసీపీ త‌ర‌పున ఆయ‌న గెలిచినా.. ఆ పార్టీ నేత‌ల‌కు కాకుండా గ‌తంలో త‌న‌కురాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చిన టీడీపీనేత‌ల‌తోనే ఆయ‌న క‌లివిడిగా ఉంటున్నారా? పైగా ఎంపీగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికార్య‌క్ర‌మాలు, ప్ర‌జ‌ల సంక్షేమానికీ పాటు ప‌డాల్సిన ఆయ‌న త‌న‌కు ఏమాత్రం సంబంధంలేని గూడూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువ గా ఉంటున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. దీంతో బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఈయ‌న ఏం చేస్తున్నారో చూద్దాం.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. నిజానికి గతంలో టీడీపీ ఆయన్ను రాజకీయంగా బాగా ప్రోత్సహించింది. పలుమార్లు గూడూరు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చింది. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన ఆయ‌న గూడూరు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ కి టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. అక్క‌డ నుంచి డాక్ట‌ర్ బ‌త్తుల జ్యోత్స్న‌ల‌త‌కు సీటు ఇచ్చింది. ఆ త‌ర్వాత ఆమెపై వైసీపీ నుంచి గెలిచిన పాశం సునీల్ టీడీపీకిలోకి వ‌చ్చేశారు.

రాజ‌కీయంగా టీడీపీలో లైఫ్‌లేద‌ని డిసైడ్ అయిన దుర్గాప్ర‌సాద్ గ‌త ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే వైసీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల్లో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఘ‌న‌విజ‌యం సాధించారు. మొదటి నుంచి గూడూరులో రాజకీయాలు చేశారు కాబట్టి.. ఆయనకి ఇక్క‌డ‌ సొంత అనుచర గణం ఉంది. అయితే, వీరంతా కూడా టీడీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇక్క‌డే ఎక్కువ‌గా రాజ‌కీయాలు చేస్తున్నార‌ట‌. తిరుప‌తిలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ప్రొటోకాల్ ప్ర‌కారం హాజ‌ర‌వుతున్నా.. గూడూరులోనే ఎక్కువ స‌మ‌యం ఉంటున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

దీంతో త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు కూడా ఎంపీ అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని తిరుప‌తి నాయ‌కులు వాపోతున్నారు. ఇదిలావుంటే గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ మ‌రింత‌గా ఎంపీ వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిరుప‌తి ఎంపీకి ఏం ప‌ని అని వ‌ర‌ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు దీంతో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక పోగా ఒక‌రిపై ఒక‌రుఆ రోప‌ణ‌లు చేసుకుంటున్నారు. వ‌ర‌ప్ర‌సాద్ 2014లో తిరుప‌తి ఎంపీగా గెలిచి… గ‌త ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే గ‌తంలో గూడూరు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు తిరుప‌తి ఎంపీగా ఉన్నారు.

వీళ్ల ఇద్ద‌రి స్థానాలు రివ‌ర్స్ అయ్యాయి. దీంతో గూడూరులో త‌న పాత టీడీపీ వ‌ర్గంతో క్లోజ్‌గా ఉండ‌డంతో పాటు వాళ్లు చెప్పిన‌ట్టు ఎంపీ ఆడుతున్నార‌ని ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ ర‌గిలిపోతున్నారు. ప్ర‌జ‌లు పిచ్చోడికి ఓట్లేశార‌ని ఒక సంద‌ర్బంలో బ‌ల్లి చేసిన విమ‌ర్శ‌ల‌పై ఆగ్ర‌హంతో ఉన్న వ‌ర‌ప్ర‌సాద్ .. ఈ విష‌యాన్ని పార్టీ అధినేత జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లాల‌ని అనుకుంటున్నారట‌. మొత్తంగా చూస్తే.. బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా ఉంద‌ని వైసీపీలోచ‌ర్చ న‌డుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news