వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్ లో పాల్గొన్న వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై పెద్ద బాంబ్ పేల్చాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వెళుతున్నారని ఆగ్రహించారు వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి. కాగా… కొండా రాఘవ రెడ్డి ప్రస్తుతం షర్మిల పార్టీ లేడని సమాచారం.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో నిన్న భేటీ అయ్యారు. ఈ తరుణంలోనే.. కొండా రాఘవ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.