ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఖరారు చేసిన విద్యాశాఖ

-

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలు అక్టోబరు 3లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా దీనికి సంబంధించి షెడ్యూలు ఖరారు చేసింది. ఈ షెడ్యూలును ప్రభుత్వానికి పంపింది.

టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ ఇదే..

ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులుఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లుఈ నెల 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలుఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులుఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లుఈ నెల 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలుఈ నెల 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతిఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లుఅక్టోబరు 3న ఎస్జీటీల బదిలీఅక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news