నేడు ఇండియా కూటమి ప్రెస్ మీట్.. కీలక ప్రకటన చేయనున్న నేతలు

-

అధికార ఎన్డీయేపై ఉమ్మడి పోరుకు నడుం బిగించిన విపక్షాల ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం ముంబయిలో రెండు రోజుల పాటు జరిగింది. ఈ కీలక భేటీకి 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ మూడో సమావేశం పూర్తైన తర్వాత నేతలు.. ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇవాళ.. ప్రెస్​ మీట్​ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడిస్తామని చెబుతామని శివసేన-యూబీటీ నేత ఉద్ధవ్​ ఠాక్రే తెలిపారు.

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డీయేను ఎదుర్కొనే వ్యూహాలపై గురువారం రాత్రి జరిగిన సమావేశంలో విపక్ష కూటమి నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ‘ఇండియా’ కూటమి లోగో ఆవిష్కరణ పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు, సంయుక్త కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ముంబయిలోని గ్రాండ్​ హయత్​ హోటల్​లో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు వివిధ పార్టీల అధినేతలు శరద్‌పవార్‌ (ఎన్సీపీ), నీతీశ్‌ కుమార్‌(జేడీయూ), లాలూ ప్రసాద్‌యాదవ్‌(ఆర్జేడీ), మమతా బెనర్జీ(తృణమూల్‌ కాంగ్రెస్‌), కేజ్రీవాల్‌(ఆప్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన-యూబీటీ), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్‌సీ), అఖిలేశ్ యాదవ్‌(సమాజ్‌వాదీ పార్టీ), హేమంత్‌సోరెన్‌(జేఎంఎం), ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), మహబూబా ముఫ్తీ (పీడీపీ), కృష్ణ పటేల్‌ (అప్నాదళ్‌-కెమెరవాడి), జయంత్‌సిన్హా (ఆర్‌ఎల్డీ), తిరుమవలవన్‌ (విడుదలై చిరుతైగల్‌ కట్చి -వీసీకే) సహా పలు పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news