వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ని గద్దే దింపడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల.. ఈ పాదయాత్ర చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతం లో ప్రారంభించిన.. చేవేళ్ల నియోజక వర్గం నుంచే వైఎస్ షర్మిల కూడా తన పాదయాత్ర ను ప్రారంభించింది. రోజు కు 12 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ షర్మిల.
అయితే… వైఎస్ షర్మిల చేస్తున్న ఈ పాదయాత్ర నేటికి 5వ రోజు కు చేరింది. మహేశ్వరం మండలం నాగారం నుండి ఇవాళ షర్మిల పాదయాత్ర ప్రారంభం అయింది. అయితే..ఈ ఈ పాదయాత్రలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాదయాత్ర లో షర్మిలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్రకు సంఘీ భావం తెలిపారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైసీపీ పార్టీ స్వయంగా షర్మిల పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కొందరు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.