ఈనెల 11 నుంచి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకి చెప్పండని… చంద్రబాబు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని ఆగ్రహించారు వైవీ సుబ్బారెడ్డి. పాదయాత్ర సందర్భంగా ఆయన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని.. రాజశేఖర్ రెడ్డి పాలన ను మించేలా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ఆగ్రహించారు.
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి తలకిందులైందని.. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని పారదర్శకతతో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు ఆయన కుమారుడు పచ్చ మీడియా విష ప్రచారం చేస్తుందని.. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు మేఘాలు తీసుకువస్తాడని ఎద్దేవా చేశారు వైవీ సుబ్బారెడ్డి.
ఇన్ని పథకాలు అమలు చేస్తున్నందుకుకా జగన్మోహన్రెడ్డి ఐరన్ లెగా అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజులకే హుద్ హుద్ తుఫాను వచ్చిందని… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా అమలు చేశారా అని ఆగ్రహించారు.