‘సర్కారు వారి పాట’లో ఆ డైలాగ్‌పై డైరెక్టర్ పరశురామ్ వివరణ

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ . ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ డెఫినెట్ గా ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మహేశ్ – కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటి కే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, డైలాగ్స్ ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహేశ్ బాబు నోటి నుంచి వచ్చిన ‘నేను ఉన్నాను..నేను విన్నాను’ అనే డైలాగ్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ టౌన్ అయిపోయింది.

స్వతహాగా రచయిత అయిన పరశురామ్ సినిమాలోని డైలాగ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూస్తుంటే స్పష్టత వస్తోంది. కాగా, ఈ ‘‘నేను విన్నాను..నేను ఉన్నాను’’ డైలాగ్ పై పరశురామ్ తాజాగా ఓ వివరణ ఇచ్చాడు.

తనకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని, ఆయనకు హీరో వర్షిప్ ఉండేదని, ఆయన నోటి నుంచి వచ్చిన ‘‘నేను ఉన్నాను..నేను విన్నాను’’ పొలిటికల్ డైలాగ్ అయినప్పటికీ అందులో చాలా అర్థం ఉందని పేర్కొన్నారు. అటువంటి సందర్భంగా తన సినిమాలో ఉందని, మహేశ్, కీర్తి సురేశ్ ల మధ్య అటువంటి సందర్భంగా వచ్చినపుడు ఈ డైలాగ్ తాను రాసుకున్నానని, మహేశ్ కూడా ఈ డైలాగ్ పైన ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని వివరించాడు పరశురామ్. ఈ నెల 12న విడుదల కానున్న ‘సర్కారు వారి పాట’ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు డైరెక్టర్. తన నెక్స్ట్ ఫిల్మ్ యంగ్ హీరో నాగచైతన్యతో ఉండబోతున్నదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version