TTD : మరోసారి టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి!

అమరావతి : ఏపీలో కాసేపట్లో నామినేటెడ్ పదవులను ప్రకటించింది అధికార వైసీపీ పార్టీ. ఈ నామినేటెడ్ పదవుల నియామకంలో కొత్త విధానానికి తెర తీశారు సీఎం జగన్. ఈ పదవుల్లో11 మంది చైర్మెన్ అదే విధంగా మరి కొంత మందికి డైరెక్టర్ పదవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్.

ఇక మరో సారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డిని నియమిస్తూ ఏపీ సిఎం జగన్ నిర్ణయం తీసుకుంది. సిఎం జగన్ తాజా నిర్ణయంతో వై వి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతే కాదు..రాష్ట్ర స్థాయి జోడు పదవుల విధానానికి బ్రేక్ వేశారు సిఎం జగన్.

కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవుల రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. వారం రోజుల కిందట పదవీ కాలం ముగిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు కూడా కొనసాగింపు లేనట్లేనని తెలుస్తోంది. అటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణుకు ముందస్తు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.