దేశంలో కరోనా కలకలం..కానీ అక్కడ జీరో కేసులు

Join Our Community
follow manalokam on social media

దేశవ్యాప్తంగా మళ్లీ కరుణ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. కరుణ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఇప్పుడు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ టెన్షన్ నెలకొని ఉంటే అండమాన్​ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్​ ప్రాంతాల్లో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా వైరస్​ వ్యాప్తి పెరుగుతున్నా.. అరుణాచల్​ ప్రదేశ్​లో గత నాలుగు రోజు నుంచి ఒక్క పాజిటివ్​ కేసు నమోదుకాకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అండమాన్ నికోబార్ దీవిలో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.

 

లెక్కల ప్రకారం చూస్తే అరుణాచల్ ప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తంగా 16,842 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు 16,784 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. అంతేకాక ఈ రాష్ట్రంలో రికవరీ రేటు 99.65 శాతం ఉంది. మరోపక్క అండమాన్​ దీవులకు పర్యటకులు పెరుగుతున్నా ఆ ప్రాంతంలో కొవిడ్​ కేసులు నమోదుకాకపోవడం గమనార్హం. రోజుకు దాదాపుగా 700-800 వరకు పర్యటకులు వస్తున్నా పరిస్థితి అదుపులో ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...