ఏబీఎన్ రాధాకృష్ణ కు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ లోని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో సిఐడి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలతో ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు అయింది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ఎస్సై జివివి సత్యనారాయణ ఫిర్యాదుపై… మంగళగిరిలోని సి ఐ డి ప్రధాన పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అలాగే ఈ కేసులో న్యాయవాది జి వి జి నాయుడు, ఏబీఎన్ వీడియో గ్రాఫర్ రమేష్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోముపల్లి రాజును నిందితులుగా పేర్కొన్నారు. రాధాకృష్ణపై నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ గుంటూరు లోని మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని… తదుపరి విచారణ కోసం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి కేసులు ట్రాన్స్ఫర్ చేసేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.