తెలుగు రాష్ట్రాల్లో పెరగిన చలి తీవ్రత…

-

తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ, ఏపీలో చలి తీవ్రత పెరగుతోంది. ఇన్నాళ్లు తుఫాన్లు, వాయుగుండాలతో కాస్త తగ్గిన చలితీవ్రత నెమ్మదిగా పెరుతుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుతున్నాయి. ఉదయం 11 కానీదే పొగమంచు తగ్గడం లేదు.. ఆ తరువాతే సూర్యుడు దర్శనమిస్తున్నాడు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చల్లని గాలులతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ జిల్లాల్లో చలి చంపెస్తుంది. కొమురంభీం జిల్లాలో 12.1 డిగ్రీలు, ఆదిలాబాద్లో 12.6, నిర్మల్ జిల్లాలో 13.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే ఏపీలోని విశాఖలో కూడా చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 12 డిగ్రీలు, చింతపల్లిలో 13 డిగ్రీలు, అరకు, పాడేరు ప్రాంతాల్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news