జింబాబ్వే కు చెందిన రైట్ ఆర్మ్ బౌలర్ అండ్ బ్యాట్స్మన్ హీత్ స్ట్రీక్ నిన్న ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. చాలా కాలంగా హీత్ స్ట్రీక్ లివర్ కాన్సర్ తో బాధపడుతున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా లోని జొహాన్నెస్ బర్గ్ లో ఈ కాన్సర్ నివారణ కోసం చికిత్స ను తీసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ రోగం నయం కాకపోవడం మరియు కొన్ని రోజుల నుండి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ఇక లాభం లేదనుకుని తన ఆఖరి రోజుల్లో జింబాబ్వే లోని బులవాయో లో ఇంట్లో అందరితో కలిసి ఉండాలని కోరుకున్నాడు హీత్ స్ట్రీక్ .. అతని కోరిక మేరకు ఇంటికెళ్ళగా నిన్న ఉదయం మరణించినట్లు తన భార్య సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ దుర్ఘటనతో జింబాబ్వే క్రీడాలోకం అంతా విషాదంలో మునిగిపోయింది.
జింబాబ్వే క్రికెట్ ను 1990 లలో ఒక దశకు తీసుకువెళ్లాడు. ఇతను 65 టెస్ట్ లు ఆడి 216 వికెట్స్, 1990 పరుగులు చేశాడు.. మరియు 189 వన్ డే లలో 239 వికెట్స్, 2943 పరుగులు చేసాడు.