జింబాబ్వే టూర్‌ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

-

జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ఏడాది జూన్లో జరగబోయే టి20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ, జింబాబ్వే క్రికెట్‌ బోర్డులు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఐదు టీ20 మ్యాచ్‌లలో భాగంగా… అక్కడ జులై 6 నుంచి 14 దాకా జరుగబోయే ఈ సిరీస్‌లో పాల్గొననుంది.ఈ మేరకు జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.

axar patel into t20 world cup 2024
axar patel into t20 world cup 2024

బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్‌ ఖరారైనట్లు జింబాబ్వే క్రికెట్‌ చైర్మన్‌ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.కాగా.. జింబాబ్వేతో ఇండియా మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచింది.తొలిసారిగా జింబాబ్వేతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సందర్భంగా.. బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. జింబాబ్వే క్రికెట్‌ను పునర్నిర్మిస్తున్నందున వరల్డ్ క్రికెట్‌లో ఇది ఉత్తేజకరమైన దశ అని, దేశంలో క్రికెట్ వృద్ధికి సహాయపడేందుకు ఇండియా తనవంతు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news