ఇది చైనాలోని ఒక జూ అధికారుల నిర్వాకం. తోడేలు ఉండే ఎన్‌క్లోజర్‌లో ముసలిది అయిపోయి మృతి చెందిన తోడేలు స్థానంలో కుక్కను ఉంచి జనాలను మోసం చేయడానికి చేసిందో జూ యజమాన్యం. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే చైనాలో ఉన్న గ్జియాంగ్‌వుషాన్ జూకి ఒక వ్యక్తీ వెళ్లాడు.
అక్కడ అన్ని జంతువులను చూసుకుంటూ వెళుతున్న క్రమంలో తోడేలు అని రాసి ఉన్న చోట ఎన్‌క్లోజర్ లో కుక్కలా కనిపించింది. పరీక్షగా చూసి, అది కుక్కేనని ధ్రువీకరించుకున్నాక జూ సిబ్బందిని నిలదీయగా ఒకప్పుడు ఆ ఎన్‌క్లోజర్‌లో తోడేలు ఉండేదని, వయో భారం కారణంగా అది మృతి చెందిందని తెలిపారు. ఎన్‌క్లోజర్‌ను ఖాళీగా ఉంచటం బాగోదని కొద్ది రోజుల పాటు కుక్కను ఉంచుతున్నామని చెప్పారు. దీంతో ఎన్‌క్లోజర్‌లో కుక్క ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.