అన్ని తెరాసకే అనుకూలం…

-


తెలంగాణ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో …ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇందులో భాగంగా.. టైమ్స్‌నౌ సంస్థ సర్వే ప్రకారం.. అధికార తెరాసకు 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమి 37 చోట్ల, భాజపా 7చోట్ల, ఇతరులు 9చోట్ల విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇదిలా ఉంటే…న్యూస్‌ 18 సర్వే మాత్రం ప్రకారం చూస్తే.. కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజా కూటమి, తెరాస మధ్య బలమైన పోటీ ఉన్నట్లు తెలిపింది. తెరాస 50 నుంచి 56 సీట్లు, కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమికి 38 నుంచి 52, భాజపాకు 4 నుంచి 7, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది

…ఏది ఏమైనా పోలింగ్ యంత్రాల్లో నాయకుల భవితవ్యం తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే మరి… 

Read more RELATED
Recommended to you

Latest news