పాకిస్తాన్,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ఎక్కువ అవుతున్నాయి. 9 మంది పాకిస్థానీయులు ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో పని చేస్తున్నారు. శనివారం రోజు వారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణం ఇరాన్ ఆగ్నేయ సరిహద్దుల్లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరవణ్ నగరం సమీపంలో జరిగింది. పాకిస్తాన్ కు చెందిన 9 మంది పౌరులు ను కాల్చి చంపడంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఈ నేరం చేసిన వారిని పట్టుకోవాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు.
ఇరాన్‌కు పాక్ రాయబారిగా ఉన్న మహ్మద్ ముదాస్సిర్ భయానక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నజీర్ కన్నాని కాల్పుల ఘటనను ఖండిస్తున్నామని, రెండు దేశాల మధ్య సోదర సంబంధాన్ని దెబ్బతీసేందుకు విధ్వంసక శక్తులు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించేది లేదని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత చల్లార్చాలని గత సోమవారం ప్రకటించాగా.. ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకుంది.నెల 16న క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. జైష్ అల్ అదిల్ స్థావరాలే లక్షంగా దాడులు చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ రాయబారినే బహిష్కరించిన పాకిస్తాన్. ఇరాన్ దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు పిల్లలు మరణించారు.