రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరాలపై కేంద్ర స్పందించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 9 నుంచి వారం లో పు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ లు రాష్ట్రానికి చేరుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఈసీఐఎల్ లో తయారవుతున్న యంత్రాలు, బెంగళూరులో తయారవుతున్న యంత్రాలు తెలంగాణకు సరఫరా చేయాలని ఈసీ ఆదేశించింది. వీటితో పాటు ఈ నెల 11న కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటింస్తుందని, రాజకీయ పార్టీలతో సమావేశమవుతారని రజత్ కుమార్ తెలిపారు. ఈసీ బృందం అందించే నివేదిక ఆదారంగా ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.