ఇండియా కూటమి నుంచి విడిపోయి బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు.బిహార్ తాజా రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, జేడీయూ కూటమి ఏడాది కూడా నిలబడదని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత నితీశ్ కుమార్ బీజేపీకి బైబై చెప్తారని అన్నారు. ‘2025 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగదు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత మార్పు జరుగుతుంది. ఈ విషయం రాసిస్తా’ అని తేల్చి చెప్పారు.
నితీష్ సీఎంగా బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా విజయ్ సిన్హా,సమ్రాట్ చౌధురి తో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇండియా కూటమి పరిస్ధితులు సవ్యంగా లేనందునే కూటమి నుంచి వైదొలగుతున్నానని నితీష్ కుమార్ తెలిపారు.