కాంగ్రెస్ నేతల్లో జోష్ పెంచిన రాహుల్ నేత

-

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించారు.శనివారం మధ్యాహ్నం భైంసా, కామారెడ్డి సభల్లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అవినీతిలో కేసీఆర్, మోదీ దొందూ  దొందే అంటూ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల సొమ్ముదోచిపెట్టారన్నారు.  ప్రాణహిత- చేవెళ్ల పేరు మార్చి అంబేడ్కర్‌ను అవమానించారన్నారు. అంబేడ్కర్‌ను దేశమంతా తలచుకుంటుంటే.. తెలంగాణ సీఎం రీడిజైనింగ్ పేరుతో అవమానించారన్నారు. అంబేడ్కర్‌ పేరుతో రూ.38వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును.. రూ.లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని వివరించారు. రూ.రెండున్నవేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులని అమాంతం రూ.12వేల కోట్లకు పెంచారన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదేనని తెలిపారు. ఇంటికో ఉద్యోగం, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి సహా ఏ ఒక్కహామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని రాహుల్‌ విమర్శించారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలను పట్టించుకోని తెరాస అధినేత.. రూ.300 కోట్లతో ప్రగతిభవన్‌ కట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన మాదిరిగానే కేంద్రంలో మోదీ పాలన కొనసాగుతోందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు.. ప్రజల కలలు సాకారం చేసేందుకే కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లారని… గల్ఫ్ వెళ్లిన వారి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదు.. గల్ఫ్‌ బాధితుల కోసం తాము రూ.1000 కోట్లతో నిధి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల మేర రుణమాఫీ ఒకే విడతలో మాఫీ చేస్తామని చేస్తామని రాహుల్‌ ప్రకటించారు.. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఏ ఆశయాలతో రాష్ట్రం ఏర్పడిందో వాటికి అనుగుణంగా తాము వ్యవహరిస్తామన్నారు. కేసీఆర్, మోదీల తనకు అబద్దాలు చెప్పడం రాదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆశించిన ప్రగతి సాధించడంలో విఫలం అవ్వడానికి కారణం కేసీఆర్ పాలన అంటూ దుయ్యబట్టారు. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news