కేసీఆర్ ని భూతులు తిడితే కమిటీలో స్థానం కల్పిస్తారా…రాజగోపాల్ రెడ్డి

-

కాంగ్రెస్ అధిష్టానం త‌న‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డాన్ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ఈనేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ…. పార్టీ కోసం సర్వం దారపోసిన వారు పార్టీలోపాలను చెబితే పాజిటివ్ గా తీసుకోకుండా మాకు షోకాజ్ నోటీసులు పంపడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాంగ్రెస్ భవన్లో కూర్చోని భూతులు తిడితే కమిటీల్లో స్థానం కల్పించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలో లేనివారి పేర్లు క‌మిటీ లిస్టు ఉన్నాయి..అంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు..లేరో అనే విషయాన్ని సైతం అధిష్ఠానం పట్టింకోకపోవడం చాలా బాధాకరం.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా… నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎందుకు పిక‌ప్ కాలేదో ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు. అంద‌రూ సిఎం కావాల‌నుకుంటున్నారే త‌ప్ప పార్టీని గెలిపించాల‌ని అనుకోవ‌డంలేద‌న్నారు. పార్టీ ప‌రిస్థిత‌ని చూస్తే చాలా బాధేస్తుంది. గాంధీభ‌వ‌న్‌లో ప‌ద‌వులు అమ్ముకుంటున్నార‌ని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వీక్ అభ్య‌ర్ధుల‌ను పోటీ పెట్టించుకుంటున్నార‌ని ఆరోపించారు. పార్టీ ప‌ద‌వుల‌ను సంతలో వస్తువుల్లా రేటు అకట్టుకుని అమ్ముకునే వారా…నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలో కొంత మంది పెద్దలు అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news