ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన క్యాంప్ కార్యాలయాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. గత కొద్దినెలలుగా జగదీశ్‌రెడ్డి తన తల్లి పేరున ఎస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో విద్యార్థులు, క్రీడాకారులకు పుస్తకాలు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సురేంద్ర మోహన్‌కు ఫిర్యాదు చేశారు. పలు అంశాలపై కలెక్టర్ సురేంద్రమోహన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కలెక్టర్‌ను కూడా తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేయడంతో నేతల ఫిర్యాదుపై విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఆర్డీఓ మోహన్‌రావు, తహశీల్దార్ మహమూద్ అలీ బుధవారం ఎట్టకేలకు నూతన క్యాంప్ ఆఫీస్‌కు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్ రెడ్డికి చెందిన వాల్ పేయింటింగ్స్, కటౌట్లు, బ్యానర్లను తొలగించారు. కూడా జగదీశ్ రెడ్డి కోడ్ ఉల్లంఘనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కి ఫిర్యాదు చేశారు.