దీన్ని వదల్లేదా : తెలంగాణ మిడ్ డే మీల్ పేరుతో బీఆర్ఎస్ లీడర్ రూ.5 కోట్ల చీటింగ్

-

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు ఇలా మండల స్థాయి లీడర్ల వరకు వారు వేసిన భూ ఆక్రమణలు, ప్రభుత్వ పథకాల్లో దోపిడి భాగోతాలు రోజుకో చోట బయటపడుతున్నాయి. ప్రజావాణిలో రోజుకో బీఆర్ఎస్ నేతపై బాధితులు కంప్లెంట్లు ఇస్తున్నారు. ఇవి గాకుండా బడా నేతల పేరు చెప్పి పలువురి దగ్గర కోట్లు దండుకుంటున్నారు . తాజాగా మిడ్ డే మీల్స్ పేరుతో బెంగళూరు కంపెనీకి రూ. 5 కోట్లు మోసం చేసిన బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అప్పగిస్తామని వారి నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ జీవోలు చూపెట్టి తమ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత కనిపించకుండా తిరుగుతున్నారని బాధితులు పోలీసులును ఆశ్రయించారు. దీంతో అరవింద్ ను అరెస్ట్ చేశారు. అరవింద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యక్రమాలను చూస్తుంటాడు.

Read more RELATED
Recommended to you

Latest news