అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు తెలుగులో విడుదల కావడంతో మేకర్స్ ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేయలేదు.
అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.టాలీవుడ్ టాప్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ చేతుల మీదిగా ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి.సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. నివేదితా సతీశ్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఓవర్సీస్‌లో హవా చాటుతోంది.