- ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా..
- సిఐ గోరంట్ల మాధవ్కు ఎంపీ జేసీ సవాల్
‘నాలుక కోస్తా అన్నావ్’… ఎక్కడికి రావాలంటూ..పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సిఐ గోరంట్ల మాధవ్‌పై, తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీసీ మాట్లాడుతూ…’నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అంటూ సవాల్ విసిరారు. ఈ నెల 25 తర్వాత తాను బయటకు వెళుతున్నానని, ఈ లోపు ఎక్కడికి రావాలో చెబితే, తాడోపేడో తెల్చుకుందామన్నారు. తాడిపత్రి ఘర్షణ సమయంలో పోలీసులు బాధ్యాతాయుతంగా వ్యవహరించలేదన్నారు.
200 మంది కర్రలతో దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు హిజ్రాల్లా పారిపోయారన్నాను. నా వ్యాఖ్యలతో ఎవరైన బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని.. ఏ ఒక్కరి ఉద్దేశించో ఆ పదాన్ని ఉచ్చరించలేదని వివరణ ఇచ్చారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరుగెత్తితే కోపంతో అలా అన్నానని చెప్పారు. తను చుట్టూ ఎన్నోసార్లు తిరిగిన సీఐ మీసం మెలేస్తూ..నన్నే బెదిరిస్తాడా… సీఐ మాధవ్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రభోదానందస్వామి ఆశ్రమాన్ని తొలిగించాలని జెసి డిమాండ్ చేశారు.