పాడుబుద్ధి అంటే ఏంటి అంటారా? ఆ పోలీస్ తాతకు ఓ రోగముంది. ఏం రోగమంటే చేతులు గులగుల పెట్టే రోగం. ఆయనను తాతా అని ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే.. ఆయన వయసు 58 ఏళ్లు. అంటే తాతే కదా. ఇక అసలు విషయం ఏంటంటే.. కేరళలోని కొచ్చిలోని తివారా ప్రాంతం అది. అక్కడే ఉన్న ఓ చర్చి ముందు శివకుమార్ అనబడే ఈ హోం గార్డ్ తాత డ్యూటీ చేయాలి. డ్యూటీ అంటే ఏదో ఉగ్రవాదులో లేక మరెవరితోనే యుద్ధం చేయడం కాదు.. ఆ చర్చి ముందు నిలబడటమే ఆయన డ్యూటీ.
ఇక.. ఖాళీగా రోడ్డు మీద నిలబడలేక మనోడి చేతికి దురద పెట్టడం ప్రారంభించింది. దీంతో రోడ్డు మీద నిలబడి అక్కడి నుంచి వెళ్తున్న అమ్మాయిలను, యువతులును, మహిళలను ఎవ్వరినీ వదలడు. తన చేతితో తాకడానికి ప్రయత్నిస్తాడు. గులానందం పొందుతాడు. నడుచుకుంటూ వెళ్లే అమ్మాయిల నడుమును, ఇతర భాగాలను కావాలని తాకుతాడు. ఓహో.. ఇంతపనికొస్తావా ముసలోడా? ఈ వయస్సులోనూ నీకు ఇదేం పోయేకాలమని ఓ వ్యక్తి మనోడి తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. ఈ విషయం కాస్త పోలీస్ బాస్‌కు తెలవడం.. మనోడు అడ్డంగా బుక్కవడంతో ఆ తాత జాబ్ ఊడబీకి లైంగిక వేధింపులు, విధిలో నిర్లక్ష్యం.. ఇంకా ఏదేదో కేసులు పెట్టారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది కదా.. నెటిజన్లు ఊరుకుంటరా? మనోడి తాట తీశారు. ఓరి బడవా.. ముసలోడివవుతున్నా.. ఇంకా ఇదేం పాడుబుద్ధిరా బాబు. మళ్లీ పోలీసోడివి. నువ్వే ఇలా చేస్తే సామాన్య జనాలు ఇంకెలా చేయాలి అంటూ ఆ హోంగార్డ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అది సంగతి. మరి.. ఆ వీడియో మీరు కూడా చూస్తారా? చూడండి.. చూడండి..