మొహర్రం రోజు ముస్లిం యువకులు రక్తం ఎందుకు చిందిస్తారంటే..?

-

త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం అంటే గుర్తొచ్చేది పీర్ల పండుగ. అవును. ఊళ్లలో మొహర్రంను పీర్ల పండుగ అనే పిలుస్తారు. అయితే.. మొహర్రాన్ని త్యాగానికి ప్రతీకగా ఎందుకు జరుపుకుంటారు. మొహర్రం అనేది ముస్లింలకు సంతాప దినం. ఆరోజు ముస్లిం యువకులు బ్లేడ్లతో తమ చాతిని కొసుకొని రక్తం చిందిస్తారు. ఇదో విషాదకరమైన రోజు కాబట్టి ముస్లింలు దీన్ని ఓ వేడుకలా కాకుండా సంతాప దినంలాగానే చేసుకుంటారు.

ముఖ్యంగా మొహర్రం అనగానే ముందు మాట్లాడుకోవాల్సింది ఇమామ్ హుస్సేన్ త్యాగం గురించి. అవును. ఇస్లాం మతాన్ని కాపాడటం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ మరణిస్తాడు. ఇస్లాం కోసం జరిగిన పవిత్ర యుద్ధంలో హుస్సేన్ మొహర్రం నెలలోనే వీరమరణం పొందుతాడు. యాజీద్ అనే ఓ నియంతకు వ్యతిరేకంగా హుస్సేన్ ఉద్యమించడంతో యాజిద్.. హుస్సేన్‌పైకి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ యుద్ధంలో ఇమామ్ హుస్సేన్‌ను యాజిద్ సైన్యం చంపేస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం..మొహర్రం నుంచి ముస్లింలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదే నెలలో హుస్సేన్ ప్రాణత్యాగం చేయడంతో ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా మొహర్రం నెలలో పది రోజుల పాటు సంతాప దినాలను నిర్వహిస్తారు ముస్లింలు.

ఆయన ఆత్మ శాంతించాలని.. ముస్లింలంతా మొహర్రం రోజు ఉపవాసం ఉంటారు. ఇక.. షియా ముస్లింలు.. బ్లాక్ డ్రెస్ ధరించి ఆయన త్యాగానికి గుర్తుగా తమ రక్తాన్ని కూడా చిందిస్తారు. హుస్సేన్‌కు మాతం చెల్లిస్తారు. రక్తాన్ని చిందించడమే మాతమ్. మరికొంతమంది అల్లా మోక్షం కోసం రక్తం చిందిస్తారని అంటారు. ఈ పండుగనే మన దగ్గర పీర్ల పండుగగా జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news