నేను ఎవర్నీ వదులుకోను.. నన్ను కాదంటే ఏమీ చేయలేను: పవన్

-

ఇటీవల పార్టీని వీడి వెళ్తున్న నేతలను ఉద్దేశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమలాపురం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘పార్టీని వీడే నాయకులకు ఒకటే చెప్తున్నా. నేను ఎవర్నీ వదులుకోను అని గుండెల్లో పెట్టుకుంటా. కానీ నన్ను కాదని వెళ్తే ఏమీ చేయలేను. నాయకులు పార్టీలోకి వస్తారు. వెళ్లిపోతారు. జనసేన,జనసైనికులు, వీరమహిళలు, పార్టీ మద్దతుదారులు.. రాష్ట్ర, ప్రజాక్షేమం కోసం నిలబడతారు’ అని పవన్ అన్నారు.

‘జగన్ జీవితం జైలుకి, బెయిల్కి మధ్య ఉంది. ఆయనది ఊగిసలాడే జీవితం అని విమర్శించారు..గుర్తుపెట్టుకో జగన్. నీకు రోజులు దగ్గరపడ్డాయి. నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. నిన్ను జైలుకి పంపిస్తాం.అకారణంగా మమ్మల్ని తిట్టిస్తున్నావు. రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేస్తున్న వ్యక్తికి అండగా నిలబడే నాయకులు ఆలోచించాలి’ అని పవన్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news