పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది – కేటీఆర్

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో మాట్లాడుతూ.. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదని,పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవిలో మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ సీఎం కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారని, ఓ కవి రాసిన పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందన్నారు.

 

 

ప్రతి పల్లెలో డంప్ యార్డ్,ట్యాంకర్ లు , ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠvధామాలు, నర్సరీలు లాంటివి తెలంగాణలో తప్పితే మరే ఇతర రాష్ట్రంలో లేవని అన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ గా రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానని, 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పెండింగ్ బిల్లుల సమస్య పై ప్రభుత్వం తో మాట్లాడడానికి సిద్దంగా ఉన్నా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news