దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం…
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముకోవడంతో పరస్పర మాటల దాడి మరింత పేరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌పై జరిగిన దాడి గురించి ఏపీ మంత్రి పరిటాల సునీత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాప్తాడు నియోజకవర్గం ప్రజలతో కలిసి వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని చంద్రబాబు ప్రభుత్వంపై తోయడం మంచి పద్ధతి కాదన్నారు. జగన్‌కు చిన్న గాయమైతేనే పోలీసు వ్యవస్థ విఫలమైందంటోన్న వైసీపీ నేతలకు వైఎస్‌ఆర్ హయాంలో పరిటాల రవిని పోలీస్‌స్టేషన్ సమీపంలోనే హత్య చేసినప్పుడు వారికి పోలీసుల వైఫల్యం కనిపించలేదా? అని ప్రశ్నించారు. నాడు రవి హత్య గురించి మాట్లాడిన వారే కరవయ్యారని, నాటి గవర్నర్, నాయకులు ఒక్కరూ కనీసం పలకరించలేదని గుర్తుచేశారు. జగన్ పై దాడిని ప్రభుత్వం ముమ్మాటికి ఖండిస్తోంది..అలా అని ప్రభుత్వంపై ఆ దాడిని నెట్టడం వారి కుఠిల రాజకీయానికి పారాకాష్టం అంటూ తెలిపారు.