దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు నేడు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. గురువారం తెల్లవారు జాము 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. దర్శనానికి భక్తులు భారులు తీరడంతో కొండ కింద వినాయక గుడి నుండి రెండు క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ని అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ అవతారంలో వరంగల్ భద్రకాళి అమ్మవారు, బ్రహ్మచారిణిగా బాసర సరస్వతి, సంతాన లక్ష్మి అవతారంలో భద్రాద్రిశ్రీలక్ష్మీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.