మరోసారి భగ్గుమంటున్న గ్యాస్ సిలిండర్ల ధరలు…!

-

గ్యాస్ సిలిండర్ల ధరలు భగ్గుమంటున్నాయి. CNG, PNG ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక కేజీ కి 70 పైసలు ఢిల్లీ ఎన్సీఆర్ లో పెరిగింది మరియు PNG గ్యాస్ 91 పైసలు పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలు లోకి వచ్చాయి.

gas cylinder prices
gas cylinder prices

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ చెప్పిన దాని ప్రకారం ఢిల్లీ లో CNG రూపాయలు 43.40 కేజీకి పెరిగిందని చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా కేజీకి 49.08 నోయిడా లో ఉంది. గ్రేటర్ నోయిడా గజియాబాద్ లో 49.08 ఉండగా… ఢిల్లీలో ఇప్పుడు PNG కొత్త ధర రూపాయలు 28.41 ప్రతీ ఎస్సెమ్ కి ఉంది.

సోమవారం నాటికి LPG రూపాయలు 25 పెరిగింది. ఫిబ్రవరి నుండి చూసుకుంటే ధరలు పెరగడం ఇది నాలుగో సారి. 14.2 కేజీలు ఎల్పిజి సిలిండర్ ఫిబ్రవరి నుండి చూసుకుంటే రూపాయలు 125 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ 794 రూపాయల నుంచి 819 రూపాయలకు పెరిగింది. ఇది సబ్సిడైజ్డ్ మరియు నాన్ సబ్సిడైజ్డ్ సిలిండర్స్ కూడా ఇది వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news