వ్యాక్సిన్ వేయించుకున్న కిషన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు !

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా వేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సెంటర్ లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం అని కానీ ప్రైవేట్ లో 250 రూపాయలని అన్నారు. అంత కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని ఆయన అన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూల్ చేయాలని ప్రైవేట్ వారికి విజ్ఞప్తి చేశారు. 10 వేల ఫ్రీ వాక్సినేషన్ సెంటర్ లు ఉన్నాయని వాటిని 20 వేలకు పెంచుతామని అన్నారు. తెలంగాణ లో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 అని అన్నారు. తెలంగాణ లో 250 కేంద్రాల్లో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రధాని తీసుకున్నాడు .. ఈటెల రాజేందర్ తీసుకున్నాడు… ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news