మార్చి నాటికి ప్రతీ ఇంటికి నల్లానీరు..కేసీఆర్

-


మిషన్ భగీరథ పనులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి మంచినీరు సరఫరా చేయాలని ఆధికారులకు సూచించారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందించేల చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు నివేదించడా.. దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయలన్నారు. వచ్చే జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు.

మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సీ. కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news