వైరల్ గా మారిన స్నేహ దూబే

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్నేహదూబే పేరు మారుమోగుతోంది. పాక్ ప్రధానికి దిమ్మతిరిగే సమాధానంతోె  ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారింది.  ఎవరీ అమ్మాయి అనే డౌట్ కలుగుతుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే… ఐరాసలో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని అసత్యపు ప్రేలాపలనకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ఆప్గనిస్థాన్ విషయంలో ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ సిగ్గు లేకుండా మరోసారి భారత్ పై విషం చిమ్మారు. మోడీని ఫాసిస్ట్ గా అభివర్ణించడమే కాకుండా భారత్ ముస్లీం వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తుందని అసత్య ఆరోపణలు చేశారు.  దీనికి ప్రతిగా ఐరాసలో ఫస్ట్ సెక్రటరీగా ఉన్న స్నేహదూబే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్థానే ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని, ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తానే బాధితురాలిగా నటిస్తుందని దుయ్యబట్టింది. పాకే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, నిధులను అందిస్తుందని, ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులు మీదేశంలోనే ఆశ్రయం ఇచ్చారని స్నేహ తీవ్రంగా స్పందించింది. తన సమాధానం ద్వారా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాయేంటనేది తెలియజేసింది. ఇలా ఘాటుగా పాకిస్థాన్ కి బుద్ధి చెప్పడంతో ఇండియాలో  ఆమెపై ప్రశంశలు కురుస్తున్నాయి. స్నేహ దూబే 2012 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెంది ప్రస్తుతం ఐరాసాలో భారత ఫస్ట్ సెక్రటరిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news