వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి.

-

సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డును జీవితంలో ఒక్కసారైనా తాకాలని ఎంతో మంది హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఆశ పడుతుంటారు. అయితే ఈ సంవత్సరం నిర్వ‌హించే ఆస్కార్‌ అవార్డుల వేడుకకు సంబంధించి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక 96వ ఆస్కార్‌ వేడుకలు మార్చి 10న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో ఘనంగా జరుగునున్నాయి. దీనికి సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియ జనవరి 12న మొదలై జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది అని ఆస్కార్‌ అకాడమీ నిర్వ‌హాకులు వెల్ల‌డించారు.

ఇక ఈ అకాడమీలో మొత్తం పదివేల మందికి పైగా సభ్యులు వారికి కేటాయించిన విభాగాల్లో ఓటు వేయ‌నున్నారు. అయితే గ‌త‌ ఏడాది ఆస్కార్‌ అకాడమీ సభ్యులుగా చోటు ద‌క్కించుకున్న టాలీవుడ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ లు త‌మ‌ ఓటును వినియోగించుకోనున్న‌ట్లు తెలుస్తుంది.ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీలో కొత్త సభ్యులుగా ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లు గ‌త‌ ఏడాది చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news