హైదరాబాద్ లో నకిలీ మైసూర్ శాండల్ సోప్స్.. తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

-

కల్తీకి కాదేదీ అనర్హం అంటూ…. ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు నకిలీ కేటుగాళ్లు. ఏది డిమాండ్ ఉండి మార్కెట్లో బాగా అమ్ముడు పోతుందో అలాంటి బ్రాండ్ లను ఎంచుకొని ముఖ్యంగా జనం ఎక్కువగా నివసించే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ కల్తీ వస్తువులను తయారీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట,నూనెలు, సబ్బులు, ఆఖరికి పిల్లలు తినే ఐస్ క్రీమ్ ,చాక్లెట్లు లను కూడా వదలకుండా నకిలీ తయారు చేసి సంపాదించేస్తున్నారు.. తాజాగా నకిలీ మైసూర్ శాండల్ సోప్ లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మలక్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్ ,నకిలీ ఉత్పత్తులతో సహా సుమారు రూ. 2 కోట్ల విలువైన మెటీరియల్ ను పోలీసులు సీజ్ చేసుకున్నారు.

9400 సబ్బులు(75 గ్రాములు) తో కూడిన 47 పెట్టెలు,150 గ్రాముల మైసూర్ శాండల్ 1800 సబ్బు ప్యాకెట్లు, తయారీ మెటీరియల్ ను స్వాధీనం చేశారు. నిందితులు మహా వీర్ జైన్, రాకేష్ జైన్ లపై మలక్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.నకిలీ సబ్బులు హైదరాబాద్ లో చెలామణి అవుతున్నాయని కాల్ అందుకున్న మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని పరిశీలించాలని కేఎస్ డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ ను ఆదేశించారు. కేఎస్ డీఎల్ బృందం పక్కా ప్రణాళికతో నకిలీ తయారీ యూనిట్ ను కనుగొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news